karan johar: రూ. 100 కోట్ల బ‌డ్జెట్‌ `బ్ర‌హ్మాస్త్ర` సినిమాలో న‌టించే ఛాన్స్ కొట్టేసిన నాగిని

  • అమితాబ్‌, ర‌ణ్‌బీర్‌, ఆలియా న‌టీన‌టులుగా తెరకెక్కనున్న సినిమా
  • క‌ర‌ణ్ జొహార్ నిర్మాత‌
  • ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్‌తో న‌టిస్తున్న మౌని రాయ్‌

`నాగిన్ (తెలుగులో నాగిని)` టీవీ సీరియ‌ల్ తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న‌టి మౌని రాయ్ బాలీవుడ్ తెరంగేట్రం కోసం ఎప్ప‌ట్నుంచో అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం త‌న మొద‌టి సినిమాగా అక్ష‌య్ కుమార్‌తో `గోల్డ్‌`లో న‌టిస్తున్న మౌని రాయ్‌కి మ‌రో ఆఫ‌ర్ కూడా వ‌చ్చింది.

రూ. 100 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మాత క‌ర‌ణ్ జొహార్ తెర‌కెక్కించునున్న `బ్ర‌హ్మాస్త్ర‌` చిత్రంలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుందీ నాగిని. రెండో సినిమాకే అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ వంటి అగ్ర‌తారాగ‌ణంతో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డం నిజంగా మౌని రాయ్ అదృష్ట‌మ‌ని సినీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. సినిమా షూటింగ్ మొద‌టి షెడ్యూల్‌లోనే మౌని రాయ్ పాల్గొంటుంద‌ని ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ వెల్ల‌డించారు.

karan johar
brahmasthra
mouni roy
naagin
alia bhat
ayan mukherjee
amitabh bachchan
  • Loading...

More Telugu News