raj tarun: రాజ్ తరుణ్ హీరోగా 'లవర్' షూటింగ్ మొదలైపోయింది

  • రాజ్ తరుణ్ హీరోగా 'లవర్' 
  • దర్శకుడిగా అనీష్ కృష్ణ 
  • కథానాయికగా 'గాయత్రి సురేష్' పరిచయం 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్      

తెలుగు తెరపై దూకుడు చూపుతోన్న యువ కథానాయకుల జాబితాలో రాజ్ తరుణ్ పేరు ముందు వరుసలోనే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోన్న రాజ్ తరుణ్, దర్శకుడు అనీష్ కృష్ణకు ఓకే చెప్పేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందే 'లవర్' సినిమా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మొదలైంది.

 దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా .. ఫైనాన్షియర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రేమకథను కొత్త కోణంలో చూపించేదిగా 'లవర్' ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అన్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా, గాయత్రి సురేశ్ కథానాయికగా పరిచయమవుతోంది. మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.       

raj tarun
gayathri suresh
  • Loading...

More Telugu News