visha: మీడియా వార్తలు తప్పు... 'విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ'పై దాడులు చేయలేదు: జీఎస్టీ డీజీ
- విశాల్ నివాసం, కార్యాలయంపై దాడులు అవాస్తవం
- మీడియా అబద్ధం చెబుతోంది
- మేము దాడులు చేయలేదు
సినీ నటుడు విశాల్ నివాసం, కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడులు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను చెన్నై జోన్ జీఎస్టీ డీజీ ఖండించారు. మీడియా ప్రసారం చేసిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన, చెన్నైలోని వడపళనిలో విశాల్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సోదాలు కొనసాగినట్లు తమిళ, తెలుగు మీడియాలో వార్తలు వెలువడ్డాయని పేర్కొన్నారు. అవన్నీ అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ లక్షల్లో పన్ను ఎగవేసినట్లు సమాచారం రావడంతో సోదాలు చేపట్టినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ పుకార్లని ఆయన స్పష్టం చేశారు. కాగా, మెర్సెల్ సినిమా వివాదంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు హెచ్.రాజాపై మండిపడిన కారణంగా విశాల్ పై జీఎస్టీ అధికారులు దాడులు చేశారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.