hardhik patel: కాంగ్రెస్ పార్టీలో చేరనున్న హార్దిక్ పటేల్

  • రాహుల్ ను కలిసిన హార్దిక్
  • కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ వార్తలు
  • అధికారికంగా వెలువడని ప్రకటన

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పటిదార్ నేత హార్దిక్ పటేల్ చేపట్టిన ఉద్యమం గుజరాత్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గుజరాత్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  రాహుల్ గాంధీని ఆదివారం అర్థరాత్రి సమయంలో  అహ్మదాబాద్ లోని ఓ హోటల్ లో హార్దిక్ పటేల్  సీక్రెట్ గా  కలుసుకున్నారు. దీంతో, హార్దిక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. రాహుల్ సభల్లో కూడా హార్దిక్ పాల్గొంటారని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ లో చేరే విషయంపై హార్దిక్ పటేల్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

hardhik patel
rahul gandhi
congress
patidar leader
gujarat elections
  • Loading...

More Telugu News