హైదరాబాద్: హైదరాబాద్‌లో వివాహితపై కత్తితో దాడి చేసిన యువకుడు
- ఎర్రగడ్డలో ఘటన
- తనను ప్రేమించడం లేదని యువకుడి దాడి
- బాధితురాలి పరిస్థితి విషమం
- నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని రైతు బజార్ ఎదుట ఓ వివాహితపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడి పేరు రవి అని, తనను సదరు వివాహిత ప్రేమించడం లేదని ఆ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.