పాము: పాలు పోయడానికి పుట్ట వద్దకు వచ్చిన ప్రజలు.. పాము కనపడడంతో భయంతో పరుగులు
- తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో విచిత్ర ఘటన
- నాగుల చవితి సందర్భంగా నాగదేవతకు పూజలు
- తాము కొలుస్తోన్న దేవత బయటకు రావడంతో షాక్
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు నాగుల చవితి సందర్భంగా ప్రజలంతా నాగదేవతకు పూజలు జరుపుతున్నారు. పుట్టలో పాలు పోసి, కోడిగుడ్లు ఉంచి నాగదేవతారాధన చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి పాము పుట్టలోంచి బయటకు రాగానే వారంతా భయంతో పరుగులు తీశారు. పూజలు చేసిన తరువాత పుట్టలో పాలు పోయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.