team india: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు టీమిండియా జట్టు ఎంపిక.. వివరాలు ఇవే!

  • జట్టులోకి వచ్చిన మురళీ, అశ్విన్, జడేజా
  • కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే
  • మూడో స్పిన్నర్ గా కుల్దీప్

శ్రీలంకతో సొంతగడ్డపై జరగనున్న టెస్ట్ సిరీస్ కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా శ్రీలంకతో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లో మురళీ ఆడలేదు. జట్టు కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించనుండగా... వైస్ కెప్టెన్ గా రహానే కొనసాగనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్ మూడో స్పిన్నర్ గా జట్టులో కొనసాగనున్నాడు.

జట్టు వివరాలు ఇవే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యా

team india
indian test squad
srilanka tour
bcci
  • Loading...

More Telugu News