న్యూజిలాండ్: న్యూజిలాండ్ విజయ లక్ష్యం 281 పరుగులు
- నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా స్కోర్: 280/8
- సెంచరీ చేసిన కోహ్లీ
- చివరి ఓవర్లలో చెలరేగి ఆడిన భువనేశ్వర్
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. దీంతో, న్యూజిలాండ్ కు 281 పరుగులను విజయ లక్ష్యంగా టీమిండియా నిర్దేశించింది.
టీమిండియా బ్యాటింగ్ : ఆర్ జీ శర్మ (20), శిఖర్ థావన్ (9), కోహ్లీ (121), కేఎం జాదవ్ (12), కేడీ కార్తీక్ (37), ధోనీ (25), హార్దిక్ పాండ్యా (16), భువనేశ్వర్ కుమార్ (26), కుల్ దీప్ యాదవ్ ఒక్క పరుగు కూడా చేయకుండా నాటౌట్ గా నిలిచాడు.
టీమిండియా స్కోర్ : 280/8
న్యూజిలాండ్ బౌలింగ్ : టీజీ సౌథీ - 3, టీఏ బౌల్ట్ - 4, ఎంజే శాంట్నర్ -1