టీమిండియా: క్రికెట్ అప్ డేట్స్: మరో వికెట్ కోల్పోయిన టీమిండియా
- మూడో వికెట్ కోల్పోయిన భారత జట్టు
- 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాదవ్ అవుట్
- 17.5 ఓవర్లలో టీమిండియా స్కోర్ : 81/3
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. బౌలర్ శాంటర్ వేసిన బంతిని కొట్టిన కేఎం జాదవ్ (12), అతనికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా, ఇప్పటికే రోహిత్ శర్మ (20), ధావన్ (9) వికెట్లు పడిపోయాయి. ఈ రెండు వికెట్లను బౌల్ట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్ లో విరాట్ కోహ్లీ, కార్తీక్ కొనసాగుతున్నారు. టీమిండియా స్కోర్: 17.5 ఓవర్లలో 81/3