కంచ ఐలయ్య ఆర్య వైశ్య సంఘాలు: 28న కంచ ఐలయ్యకు సన్మానం..అడ్డుకుంటామంటున్న బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాలు!
- విజయవాడలో సన్మానం చేయనున్న దళిత సంఘాలు
- అడ్డుకుని తీరతామన్న బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల నేతలు
- సన్మాన కార్యక్రమానికి హాజరై తీరుతానన్న కంచ ఐలయ్య
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తక రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ఈ నెల 28న విజయవాడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మానం జరగనుంది. అయితే, ఈ సన్మాన కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాలు అంటున్నాయి. బ్రాహ్మణ, ఆర్య వైశ్య సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ఐలయ్యను విజయవాడ సభకు రాకుండా అడ్డుకుంటామని ఆయా సంఘాల నేతలు హెచ్చరించారు.
కాగా, కంచ ఐలయ్య మాట్లాడుతూ, తాను ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరై తీరుతానని స్పష్టం చేశారు. తాను సహజంగా మరణించకుండా ఒకవేళ హత్యకు గురైతే కనుక ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యులు కారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై కనుక గౌరవం ఉంటే ఎంపీ టీజీ వెంకటేష్ ను పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని కంచ ఐలయ్య డిమాండ్ చేశారు.