gujarath: గుజరాత్ సీఎంపై బిలియనీర్ ను నిలిపిన కేజ్రీవాల్... అసెంబ్లీ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల!

  • 11 మందితో తొలి జాబితాను ప్రకటించిన ఆప్
  • సీఎం విజయ్ రూపానీపై పోటీకి రాజేశ్ భట్
  • త్వరలోనే మరో జాబితా! 

వచ్చే నెలలో గుజరాత్ లోని 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ 11 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర సీఎంగా ఉన్న విజయ్ రూపానీ సొంత నియోజకవర్గమైన రాజ్ కోట్ (వెస్ట్) నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ రాజేశ్ భట్ ను ఆప్ పోటీకి దింపింది.

విజయ్ పై విజయం సాధించే అన్ని అర్హతలూ రాజేశ్ కు ఉన్నాయని ఈ సందర్భంగా ఆప్ గుజరాత్ ఎన్నికల ఇన్ చార్జ్ గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ ఉదయం తొలి జాబితాను విడుదల చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ జాబితాను ఖరారు చేశామని తెలిపిన ఆయన, రెండో జాబితా అతి త్వరలోనే విడుదలవుతుందని తెలిపారు.

gujarath
aap
vijay rupani
elections
assembly
  • Loading...

More Telugu News