cricket: కొత్త రికార్డులకు వేదిక కానున్న రేపటి భారత్, న్యూజిలాండ్ వన్డే!
- రేపు మొదటి వన్డే, ఈ నెల 25న రెండో వన్డే, 29న మూడో వన్డే
- విరాట్ కోహ్లీకి రేపటి వన్డే 200వ మ్యాచ్
- న్యూజిలాండ్‌పై ఇండియా రేపటి మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుపై ఇది 50వ గెలుపు
- రోహిత్ శర్మ మరో నాలుగు సిక్సర్లు కొడితే 150 సిక్సులు
ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. న్యూజిలాండ్ టీమ్‌తో భారత్ మొత్తం మూడు వన్డేలు ఆడనుంది. రేపు మొదటి వన్డే, ఈ నెల 25న రెండో వన్డే, 29న మూడో వన్డే ఆడనుంది.
కాగా, రేపటి మ్యాచ్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. భారత్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి రేపటి వన్డే 200వ మ్యాచ్. అలాగే, న్యూజిలాండ్‌పై ఇండియా రేపటి మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టుపై ఇది 50వ గెలుపు అవుతుంది. రేపు కోహ్లీ చెలరేగి ఆడి మరో ఆరు సిక్సర్లు కొడితే భారత్ తరపున వంద సిక్సర్లు కొట్టిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. అలాగే ఇప్పటికే 146 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ మరో నాలుగు సిక్సర్లు కొడితే 150 సిక్సులు అవుతాయి.