వెంకయ్య నాయుడు: వెంకయ్య నాయుడు డిశ్చార్జ్ .. ఫోన్ లో పరామర్శించిన రాష్ట్రపతి, ప్రధాని
- ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఉప రాష్ట్రపతి
- మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచన
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరడం, ఈ సందర్భంగా వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించడం తెలిసిందే. దీంతో మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. కాసేపటి క్రితం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉప రాష్ట్రపతికి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంకయ్యకు డా.బలరాం భార్గవ నేతృత్వంలోని వైద్య బృందం చికిత్స నిర్వహించింది.