ram mohan naidu: ఐరాస సమావేశాలకు వెళ్లనున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • 22 నుంచి 28 వరకు ఐరాస సమావేశాలు
  • ఓ ఎంపీని పంపాలంటూ టీడీపీని కోరిన కేంద్రం
  • రామ్మోహన్ నాయుడి పేరును సిఫారసు చేసిన టీడీపీ

ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరగనున్న ఐక్యరాజ్యసమితి (ఐరాస) సమావేశాలకు టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఐరాస సమావేశాలకు టీడీపీ తరపున ఒక పార్లమెంట్ సభ్యుడిని పంపాలని కేంద్రం కోరడంతో... రామ్మోహన్ నాయుడి పేరుని టీడీపీ అధిష్ఠానం సిఫారసు చేసింది. గతంలో ఆయన తండ్రి ఎర్రంనాయుడు కూడా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు ఐరాస సమావేశాలకు వెళ్లడానికి ఎంపిక కావడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ram mohan naidu
Telugudesam mp
united nations
Telugudesam
  • Loading...

More Telugu News