team India: రహానే బ్యాటింగ్ ఆర్డర్ పై పూర్తి నిర్ణయం కోహ్లీదే: రోహిత్ శర్మ

  • ఆసీస్ తో వన్డే సిరీస్ లో ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన రహానే
  • న్యూజిలాండ్ సిరీస్ లో ఓపెనర్ గా వస్తాడా? అని ప్రశ్నించిన మీడియా
  • రహానే బ్యాటింగ్ ఆర్డర్ పై పూర్తి నిర్ణయం కోహ్లీదేనని స్పష్టం చేసిన రోహిత్

టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే బ్యాటింగ్ ఆర్డర్ పై పూర్తి నిర్ణయాధికారం కోహ్లీదేనని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. న్యూజిలాండ్ తో రేపు వన్డే ఆడనున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ ను రహానేను ఓపెనర్ గా పంపుతారా? అన్న ప్రశ్నకు, ఆ విషయం తనకు తెలియదని సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా సిరీస్ కు ధావన్ అందుబాటులో లేకపోవడంతో రహానే ఓపెనర్ గా వచ్చాడని తెలిపాడు. అయితే, ఇప్పుడు శిఖర్ ధావన్ అందుబాటులో ఉన్నాడని, దీంతో రహానే ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చే అవకాశం లేదని అన్నాడు.

వన్ డౌన్ లో కెప్టెన్ కోహ్లీ వస్తాడని, ఆ తరువాత రహానే బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉందని అన్నాడు. ఆ స్థానంలో గతంలో బ్యాటింగ్ చేసిన అనుభవం రహానేకు ఉందని గుర్తుచేశాడు. అయితే రహానే బ్యాటింగ్ ఆర్డర్ పై నిర్ణయాధికారం పూర్తిగా కెప్టెన్ కోహ్లీదేనని తెలిపాడు. కోహ్లీ, రవిశాస్త్రి దానిని నిర్ణయిస్తారని అన్నాడు. కాగా, రేపటి నుంచి భారత్ లో న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News