పోకిరీలు: హైదరాబాద్‌లో పోకిరీల ఆగడాలు.. కారులో వెళ్తూ టపాసులు కాల్చి రోడ్డు పక్కన నిలబడ్డ వారిపై విసిరేసిన వైనం!

  • పంజాగుట్ట రోడ్డుపై మహిళలను హడలెత్తించిన యువకులు 
  • సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసుల ద‌ర్యాప్తు
  • ఐదుగురి అరెస్ట్

ఎల్ల‌ప్పుడూ ర‌ద్దీగా ఉండే హైదరాబాద్‌లోని పంజాగుట్ట రోడ్డుపై కొంద‌రు పోకిరీలు హ‌ల్‌చ‌ల్ చేశారు. ప్ర‌జ‌లంతా దీపావ‌ళి పండుగ సంబ‌రాల సంద‌ర్భంగా ఇంటి వ‌ద్ద ట‌పాసులు కాల్చుకుంటోంటే, ఈ పోకిరీలు మాత్రం పంజాగుట్ట‌లో కారులో షికార్లు కొడుతూ అందులో నుంచి ట‌పాసులకు నిప్పు అంటించి రోడ్ల‌పై వెళుతోన్న వారిపై విసిరేస్తూ అల‌జ‌డి రేపారు. దీంతో భయాందోళనలకు గురైన మహిళలు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ద‌ర్యాప్తు జ‌రిపి ఐదుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.   

  • Loading...

More Telugu News