cyber attack: ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, బస్టాండ్ లోని వైఫై వాడుతున్నారా?...అయితే ఈ హెచ్చరిక మీకే!

  • పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ ప్రమాదకరమన్న సీఈటీటీ
  • పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు
  • పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ ల వినియోగదారులను హెచ్చరించిన సీఈటీటీ

ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ లేదా ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్న వారికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈటీటీ) హెచ్చరికలు జారీ చేస్తోంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ప్రయాణ సమయాల్లో బ్రౌజ్ చేస్తున్న వారిపై హ్యాకర్లు కన్నేశారని ప్రభుత్వ సైబర్ ఏజెన్సీ సీఈటీటీ తెలిపింది.

పబ్లిక్ సైబర్ సర్వీసుల ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని ఈ సంస్థ కోరింది. వీటిపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. అందుకే దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన వైఫై హాట్ స్పాట్‌ ల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు జరపవద్దని సూచించింది. ఇంటర్‌ నెట్ బ్రౌజింగ్ కూడా ప్రమాదకరమేనని తెలిపింది. అలా చేయడంవల్ల ఫోన్లలో నిక్షిప్తమై ఉన్న క్రెడిట్ కార్డు వివరాలు, పాస్‌ వర్డ్‌ లు, ఛాట్ మెసేజ్‌ లు, ఈ మెయిల్స్ వంటి వాటిని తస్కరించే అవకాశం ఉందని తెలిపారు. నెటిజన్లు వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ను వినియోగించాలని సూచించింది. 

cyber attack
wi fi
hot spot
airports
railway stations
bus stands
  • Loading...

More Telugu News