chidambaram: గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం మోదీకి అప్పగించారా?: ఈసీపై మండిపడ్డ చిదంబరం

  • హాలిడే మూడ్ నుంచి బయటకు రావాలి
  • ఎన్నికల తాయిలాలను ప్రకటించిన తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తారా?
  • తేదీలను ప్రకటించే అధికారాన్ని మోదీకి ఇచ్చినట్టు కనబడుతోంది

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎందుకు విడుదల చేయలేదంటూ ఎన్నికల సంఘంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ కు ఎన్నికల తాయిలాలను ప్రకటించిన తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. హాలిడే మూడ్ నుంచి ఎలక్షన్ కమిషన్ బయటకు రావాలని అన్నారు. ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారాన్ని మోదీకి ఈసీ కట్టబెట్టినట్టు కనబడుతోందని మండిపడ్డారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ పై అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకోవడం కాంగ్రెస్ హయాంలో జరిగిందని... 2014 నుంచి అలాంటివి చోటు చేసుకోలేదని చెప్పారు.

chidambaram
election commission
narendra modi
India pm
gujarat assembly elections
  • Loading...

More Telugu News