జాన్‌: హెలికాప్టర్‌ నుంచి కిందపడిపోయిన ఐఫోను.. అయినప్పటికీ చెక్కుచెదరని వైనం!

  • అమెరికాలోని న్యూయార్క్ లో ఘటన
  • 500 అడుగుల ఎత్తులో నుంచి వెళుతోన్న జాన్‌
  • వీడియో తీస్తుండ‌గా కింద పడిపోయిన ఐఫోన్

ఐఫోన్‌ల‌లో ఎన్నో ఫీచ‌ర్లు ఉంటాయి. అందుకే, చాలామంది దానిని కోరుకుంటారు. మామూలు ఫోన్‌లా కాకుండా ఐఫోనును కింది ప‌డిపోయినా ప‌గ‌ల‌కుండా ఉండేట్లు దానిని త‌యారు చేస్తారు. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న గురించి తెలుసుకుంటే ఐఫోనును ఎంత ప‌టిష్ఠంగా త‌యారు చేస్తారో తెలుస్తోంది. ప్ర‌త్యేక‌ హెలికాప్టర్‌లో 500 అడుగుల ఎత్తులో నుంచి వెళుతోన్న జాన్‌ అనే వ్యక్తి చేతిలో నుంచి ఐఫోన్ భూమిపై ప‌డిపోయింది.

జాన్ హెలికాప్ట‌ర్ నుంచి ఐఫోన్‌ ద్వారా దృశ్యాలను చిత్రీకరిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ఐఫోన్ కింద ప‌డ‌డంతో అప్పటికప్పుడు హెలికాప్ట‌ర్‌ని కిందికి దించి సుమారు గంటపాటు ఐఫోన్‌ను వెతికాడు. చివ‌రికి అది దొరికింది. త‌న‌ ఐఫోన్ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంద‌ని ఆయ‌న చెప్పాడు. వీడియో తీస్తుండ‌గా అంత ఎత్తునుంచి కింద‌ప‌డిన‌ప్ప‌టికీ త‌న ఐఫోన్‌ వీడియోను రికార్డు చేస్తూనే ఉందని అన్నాడు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటు చేసుకుంది.  

  • Loading...

More Telugu News