అక్రమాస్తుల కేసు: అక్రమాస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌పై అభియోగాలను నిర్ధారించిన కోర్టు
- అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న నవాజ్
- నవాజ్ షరీఫ్ కి భారీ షాక్
- నవాజ్ షరీఫ్ కుమార్తె, అల్లుడిపై కూడా అభియోగాల నిర్ధారణ
తనను రాజకీయంగా దెబ్బతీయడానికే తనపై కొందరు అక్రమాస్తుల ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకుంటోన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కి భారీ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో ఆయనపై వచ్చిన అభియోగాలను పాక్‌లోని ఓ అవినీతి నిరోధక కోర్టు నిర్ధారించింది. నవాజ్ షరీఫ్ కుమార్తె, అల్లుడిపైన కూడా అభియోగాలను నిర్ధారించింది. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న నవాజ్ షరీఫ్ కొన్ని నెలల క్రితమే పాక్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తన సంపాదన సక్రమమైందేనని నిరూపించుకోవడంలో నవాజ్ షరీఫ్ విఫలమయ్యారు.