ntr: కథ అద్భుతంగా ఉండటంతో విక్రమ్ కుమార్ కి ఓకే చెప్పేసిన ఎన్టీఆర్!

  • ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఎన్టీఆర్ 
  • ఆయన తదుపరి సినిమా త్రివిక్రమ్ తో 
  • విక్రమ్ కుమార్ నెక్స్ట్ మూవీ బన్నీతో 
  • ఆ తరువాత ఎన్టీఆర్ .. విక్రమ్ కుమార్ కాంబినేషన్ 

ప్రస్తుతం ఎన్టీఆర్ 'జై లవ కుశ' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫారిన్ ట్రిప్ లో వున్న ఎన్టీఆర్ .. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, ఎన్టీఆర్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఆ దర్శకుడు ఎవరో కాదు .. విక్రమ్ కుమార్.

 ఇటీవల ఎన్టీఆర్ ను కలిసిన విక్రమ్ కుమార్ ఒక అద్భుతమైన కథ చెప్పాడట. అంతే .. ఉత్సాహంగా ఆ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పేసుకున్నాడు. తాము ఈ ప్రాజెక్టు చేస్తున్నామని స్పష్టం చేసేశాడట. ప్రస్తుతం అఖిల్ తో 'హలో' మూవీ చేస్తోన్న విక్రమ్ కుమార్ .. ఆ తరువాత సినిమాను బన్నీతో చేయనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేలోగా, బన్నీ మూవీని విక్రమ్ కుమార్ ఫినిష్ చేస్తాడు. ఆ తరువాత ఎన్టీఆర్ - విక్రమ్ కుమార్ కలిసి సెట్స్ పైకి వెళతారు.   

ntr
  • Loading...

More Telugu News