దీపావళి: అండమాన్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్న నిర్మలా సీతారామన్!
- అండమాన్ నికోబార్ దీవులకు బయలుదేరిన రక్షణ శాఖ మంత్రి
- రెండు రోజుల పాటు అక్కడ త్రివిధ దళాలతో కలిసి వేడుక
- భద్రతా పరమైన అంశాలపై చర్చ
కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ సారి దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకోనున్నారు. ఇందు కోసం ఆమె అండమాన్ నికోబార్ దీవులకు బయలుదేరారు. నిర్మలా సీతారామన్ రెండు రోజుల పాటు అక్కడ త్రివిధ దళాలతో కలిసి పండుగ జరుపుకుంటారని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా సైనిక కార్యాచరణ ప్రాంతం, కార్ నికోబార్ వైమానిక స్థావరాలను కూడా ఆమె పరిశీలిస్తారు. అక్కడి సైనిక కుటుంబాలతో ఆమె ముచ్చటించనున్నారు. భద్రతా పరమైన పలు అంశాలపై కూడా చర్చిస్తారు.
కాగా, గత ఏడాది హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నూర్ జిల్లాలో చైనా బార్డర్ సమీపంలో ఐటీబీపీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఈ సారి కూడా ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీసు భద్రతా బలగాలతోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.