కేసీఆర్: ఏపీ మంత్రి యనమలకు సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు: రేవంత్ రెడ్డి ఆరోపణలు

  • యనమలకు రూ.2 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు
  • అందుకే, కేసీఆర్ పై ఆయన ఈగ కూడా వాలనివ్వరు
  • ఏపీలో పయ్యావుల కేశవ్ ను ప్రజలు తిరస్కరించారు
  • తెలంగాణలో పరిటాల సునీత, పయ్యావుల అల్లుడు కలిసి బార్ నడుపుతున్నారు
  • ఈ బార్ కు లైసెన్స్ ఎలా ఇచ్చారు?: రేవంత్ రెడ్డి 

ఏపీ టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అలాంటప్పుడు కేసీఆర్ పై యనమల ఈగ కూడా వాలనివ్వరని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఏపీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. పయ్యావులను ప్రజలు తిరస్కరించారని, ఆయన్ని తిట్టాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తెలంగాణలో పరిటాల సునీత కొడుకు, పయ్యావుల అల్లుడు నడుపుతున్న బార్ కు లైసెన్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ లేదని, అందుకే, బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించారని విమర్శించారు.

  • Loading...

More Telugu News