butta renuka: పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకకు గౌరు వెంకటరెడ్డి సూటి ప్రశ్న!

  • ఏ అభివృద్ధి కళ్లకు కనిపించింది?
  • ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తారా?
  • అందుకు శిక్ష తప్పదు
  • హెచ్చరించిన గౌరు వెంకటరెడ్డి

వైసీపీ ఇచ్చిన టికెట్ పై గెలిచి, ఇప్పుడు అభివృద్ధి పేరు చెబుతూ టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక ఏ అభివృద్ధిని చూశారో చెప్పాలని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించిన ఆయన, ఓట్లు వేసిన ప్రజలను, నమ్మిన పార్టీని మోసం చేసిన ఆమెకు తదుపరి ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

చంద్రబాబు మాయలో పడిన రేణుక విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత మూడున్నరేళ్లుగా జరగని అభివృద్ధి వచ్చే ఏడాదిన్నరలో ఎలా జరుగుతుందో చెప్పాలని అడిగారు. బుట్టా రేణుక వంటి ఒక నేత పార్టీని వీడితే అటువంటి వారు వంద మంది వస్తారని చెప్పారు.

butta renuka
gouru venkata reddy
  • Loading...

More Telugu News