dera baba: కుటుంబ సభ్యులను చూసి కన్నీరు పెట్టుకున్న డేరా బాబా!

  • జైలులో డేరా బాబాను కలుసుకున్న కుటుంబ సభ్యులు
  • స్వీట్లు, దుస్తులు అందజేత 
  • ఉద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్న డేరా బాబా

అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధా మాజీ చీఫ్ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ ను చూసేందుకు ఆయన భార్య హర్జీత్‌ కౌర్‌, కుమారుడు చరణ్ ప్రీత్, కుమార్తె జస్మీత్ సింగ్, అల్లుడు అమర్ ప్రీత్ వెళ్లారు. దీపావళిని పురస్కరించుకుని ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురై వారి ముందు కన్నీరుపెట్టుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో ఆయను ఓదార్చిన కుటుంబ సభ్యులు, స్వీట్లు, చలికాలంలో వేసుకునేందుకు దుస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, వాస్తవానికి జైలు నిబంధనల ప్రకారం విజిటర్స్ ను మధ్యాహ్నం 2 గంటలకు అనుమతించాల్సి ఉండగా, డేరా బాబా భద్రత దృష్ట్యా అయనను చూసేందుకు 3 గంటలకు అనుమతించామని చెప్పారు. సుమారు గంటన్నరపాటు ఆయన వారితో మాట్లాడినట్టు వారు తెలిపారు. 

dera baba
gurmeet ram raheem singh
family
crying
  • Loading...

More Telugu News