chandrababunaidu: యూకే, యూఎస్, యూఏఈలలో పర్యటించనున్న చంద్రబాబు!

  • వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
  • ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటన
  • ఈ నెల 26 వరకు విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు బయల్దేరివెళ్లారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు చంద్రబాబు విదేశీ పర్యటనలో వుంటారు. యూకే, యూఎస్, యూఏఈలలో ఆయన పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతుంది.

రాష్ట్రంలో మౌలిక వసతులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం తదితరాలపై ఆయన పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పర్యటన జరుగుతున్నట్టు మంత్రివర్గ సహచరులు చెబుతున్నారు. సీఎం వచ్చే వరకు మంత్రి వర్గ కమిటీ రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తించనుంది. 

chandrababunaidu
cbn
Telugudesam
amaravathi
Foreign tour
  • Loading...

More Telugu News