శ్రీశైలం: శ్రీశైలం జలాశయంలోకి భారీగా చేరుతున్న వరద నీరు!
- శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 2,35,188 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 3,09,743 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు
శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఎనిమిది గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 2,35,188 క్యూసెక్కులు, శ్రీశైలం జలాశయం ఔట్ ఫ్లో 3,09,743 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.