జగన్: బెంగళూరు నుంచి అనంతపురం చేరుకున్న జగన్.. పర్యటన షురూ!

  • చెన్నేకొత్త‌ప‌ల్లి, సీతారాం ప‌ల్లిలో పంట‌పొలాల‌ను ప‌రిశీలించిన జ‌గ‌న్ 
  • ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోవాల‌ని జ‌గ‌న్ డిమాండ్
  • కాసేపట్లో ధ‌ర్మ‌వ‌రంలో చేనేత కార్మికుల‌ స‌మ‌స్య‌ల‌పై రోడ్‌షో

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనంతపురం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టు నుంచి చెన్నేకొత్త‌ప‌ల్లికి చేరుకున్న జ‌గ‌న్‌... అనంత‌రం రైతుల‌తో మాట్లాడి వారి క‌ష్ట సుఖాల‌ను అడిగారు.  

సీతారాం ప‌ల్లిలో పంట‌పొలాల‌ను ప‌రిశీలించిన జ‌గ‌న్, భారీ వ‌ర్షాల కార‌ణంగా పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల గురించి వివ‌రాలు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోవాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. కాసేప‌ట్లో ఆయ‌న ధ‌ర్మ‌వ‌రంలో చేనేత కార్మికుల‌ స‌మ‌స్య‌ల‌పై రోడ్‌షోలో పాల్గొన‌నున్నారు.

  • Loading...

More Telugu News