రఘువీరారెడ్డి: దేశ వ్యాప్తంగా ఘ‌నంగా ఇందిర‌మ్మ శ‌త జయంతి ఉత్స‌వాలు: రఘువీరారెడ్డి

  • వ‌చ్చేనెల 17న ఇందిర‌మ్మ శ‌త‌ జ‌యంతి 
  • ఇందిర‌మ్మ త్యాగాల‌ను, దార్శినిక‌త‌ను నేటిత‌రానికి గుర్తు చేస్తాం
  • అనేక స‌మ‌స్య‌లకు ఇందిర‌మ్మ ఆలోచ‌న‌లు పరిష్కారం చూపుతాయి

ఏడు సంవ‌త్స‌రాలు ఏఐసీసీ అధ్య‌క్షురాలిగా, 16 సంవ‌త్స‌రాలు దేశ ప్ర‌ధానమంత్రిగా సేవ‌లందించిన ఇందిరా గాంధీ ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర‌ స్థానం సంపాదించుకున్నార‌ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. వ‌చ్చేనెల 17న ఇందిర‌మ్మ శ‌త‌ జ‌యంతి ఉత్స‌వం ఉన్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా తాము ఘ‌నంగా వేడుకలు నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలుపుతూ ఈ రోజు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందిర‌మ్మ త్యాగాల‌ను, దార్శినిక‌త‌ను నేటిత‌రానికి గుర్తు చేస్తామ‌ని తెలిపారు. దేశంలో ఎదుర‌వుతోన్న అనేక స‌మ‌స్య‌లకు ఇందిర‌మ్మ ఆలోచ‌న‌లు ప‌రిష్కారం చూపుతాయ‌ని తెలిపారు.  

  • Loading...

More Telugu News