రోహిణి ఆసుప‌త్రి: రోహిణి ఆసుప‌త్రిలో అగ్ని ప్ర‌మాదానికి ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణం: రోగుల బంధువుల ఆగ్ర‌హం

  • హ‌న్మ‌కొండ‌లోని రోహిణి సూప‌ర్ స్పెషాలిటి హాస్పిట‌ల్‌లో నిన్న ప్రమాదం
  • వేరే ఆసుపత్రుల్లో 198 మంది రోగులకు చికిత్స
  • ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రోగుల బంధువుల డిమాండ్

వ‌రంగ‌ల్ పట్ట‌ణం హ‌న్మ‌కొండ‌లోని రోహిణి సూప‌ర్ స్పెషాలిటి హాస్పిట‌ల్‌లో నిన్న ఆక్సిజన్ సిలిండర్ పేలి అగ్ని ప్ర‌మాదం జరగడంతో ఇద్ద‌రు మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ ఆసుప‌త్రి నుంచి 198 మంది రోగుల‌ను త‌ర‌లించి, వేరే ఆసుప‌త్రుల్లో చేర్పించారు. ఈ ప్ర‌మాదానికి ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుప‌త్రిలో ఇటువంటి ఘ‌ట‌న‌లు మళ్లీ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు బాధితులు విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News