తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు!
- సుమారు 20 రోజుల పాటు సమావేశాలు
- ఈ నెల 27 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు
- ఈ నెల 26న బీఏసీ సమావేశం
ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలను సుమారు 20 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. శాసనసభ, మండలి సమావేశాలను ఈ నెల 27 నుంచి నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభుత్వం ప్రతిపాదనలను పంపింది. ఈ నెల 26న బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. అలాగే, శాసనసభలో చర్చ జరిగిన ప్రతీ అంశంపైనా మండలిలోనూ చర్చ జరగాలని పేర్కొన్నారు.