khushboo: నటి ఖుష్బూకు బంపర్ ఆఫర్!

  • తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికయ్యే అవకాశం
  • ఖుష్బూ వైపు మొగ్గు చూపుతున్న సోనియా, రాహుల్
  • నెలాఖరులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

సినీ నటి ఖుష్బూను బంపర్ ఆఫర్ వరించే అవకాశాలు కనబడుతున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) అధ్యక్ష పదవి ఆమెకు దక్కే సూచనలు గోచరిస్తున్నాయి. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇటీవలే టీఎన్సీసీ సంస్థాగత ఎన్నికలు ముగిశాయి. పార్టీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యతను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు కట్టబెడుతూ తీర్మానం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఇళంగోవన్, కేఎస్ అళగిరి, మాణిక్ ఠాగూర్, ఖుష్బూలు ఉన్నారు. అయితే, పార్టీ అధిష్ఠానం ఖుష్బూ వైపే మొగ్గు చూపిందని... నెలఖరులో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.

khushboo
tamil nadu congress
sonia gandhi
rahul gandhi
  • Loading...

More Telugu News