sai prajwala: చదవలేక పారిపోయిందా? లేక మరో కారణమా?: ప్రజ్వల వ్యవహారంపై కూపీ లాగుతున్న పోలీసులు

  • ప్రజ్వల ఉదంతంపై పోలీసులకు అనుమానాలు
  • తిరుపతిలోని హోటల్ లో దిగిన ప్రజ్వల!
  • ప్రేమ కోణంపై పోలీసుల ఆరా

రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లిలో అదృశ్యమై, తిరుపతిలో కనిపించిన సాయి ప్రజ్వల ఉదంతంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె తిరుపతిలోని ఓ హోటల్ ముందు కనిపించడం, ఆమె అదే హోటల్ లో దిగినట్టు తెలుస్తుండటంతో తనంతట తానుగా తిరుపతికి వచ్చిందా? లేకుంటే ఆమెను మరెవరైనా తీసుకు వచ్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు సాయి ప్రజ్వల దిగినట్టు భావిస్తున్న హోటల్ సీసీ కెమెరాలను, రికార్డులను వారు పరిశీలిస్తున్నారు. కాగా, చదువులో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని చెబుతూ, తల్లిదండ్రులకు, సోదరి, సోదరులకు క్షమాపణలు చెబుతూ, తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రజ్వల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఇక ప్రజ్వల మాయం వెనుక ప్రేమ కోణం ఉండివుండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజ్వల తండ్రి తిరుపతికి చేరుకున్న తరువాత ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

sai prajwala
narayana
student
tirupati
  • Error fetching data: Network response was not ok

More Telugu News