naga: అనూహ్యంగా పెరిగిన కృష్ణమ్మ వరద... మళ్లీ ఏడు గేట్లెత్తిన అధికారులు!

  • 12 గంటల వ్యవధిలో లక్ష క్యూసెక్కులు పెరిగిన వరద
  • ఈ ఉదయం మరో 5 గేట్లను తెరిచిన అధికారులు
  • సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్ కు
  • ప్రాజెక్టు గేట్లను తాకిన కృష్ణమ్మ

నిన్న ఉదయం 80 వేల క్యూసెక్కులకు పడిపోయిన కృష్ణమ్మ వరద, గత రాత్రి నుంచి అనూహ్యంగా పెరిగింది. పై నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా పెరిగి, ఈ ఉదయానికి 2,42,638 క్యూసెక్కులకు చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 70 వేల క్యూసెక్కులను, ఏడు స్పిల్ వే గేట్లను పది అడుగుల మేరకు తెరవడం ద్వారా 1.90 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు.

నిన్న వరద ప్రవాహం గణనీయంగా తగ్గడంతో ఐదు క్రస్ట్ గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 555 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకుంది. 222 టీఎంసీల మేరకు నీటి నిల్వ చేరగా, ప్రాజెక్టు గేట్లను కృష్ణమ్మ తాకింది. మరోవైపు ఆల్మట్టికి 75 వేలు, జూరాలకు 1.19 లక్షలు, నారాయణపూర్ కు 99 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News