Kajal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సీక్రెట్ ప్రాజక్ట్ చేస్తున్నానంటున్న కాజల్ 
  • క్లైమాక్స్ పూర్తి చేసిన బాలయ్య 
  • దిల్ రాజు బ్యానర్లో రాజ్ తరుణ్ 
  • త్రివిక్రమ్ తో అనిరుధ్ మరో సినిమా

*  ప్రస్తుతం తాను ఓ సీక్రెట్ ప్రాజక్టును చేస్తున్నానని అంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. "ప్రస్తుతం తెలుగులో 'ఎమ్మెల్యే'.. తమిళంలో 'పారిస్ పారిస్' చిత్రాలను చేస్తున్నాను. అలాగే ఓ సీక్రెట్ ప్రాజక్ట్ కూడా చేస్తున్నా. దాని గురించి అప్పుడే చెప్పకూడదు. అది విడుదలయ్యాక మీకే తెలుస్తుంది" అంటూ కాజల్ ఆ సినిమా వివరాలను సస్పెన్సులో పెట్టేసింది.          
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ పూర్తయింది. ఫైట్ మాస్టర్ల ద్వయం అరిపుమణి-అంబుమణి నేతృత్వంలో ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ను భారీ ఎత్తున చిత్రీకరించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  యువ హీరో రాజ్ తరుణ్ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్లో చేస్తున్నాడు. 'అలా ఎలా' చిత్ర దర్శకుడు అనీష్ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మరో రెండు వారాల్లో మొదలవుతుంది.
*  ప్రస్తుతం త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాత వాసి' చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్న అనిరుథ్ రవిచందర్  .. త్రివిక్రమ్ తో మరో చిత్రాన్ని చేయనున్నాడు. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే చిత్రానికి కూడా తానే సంగీతాన్ని అందించనున్నట్టు అనిరుధ్ తెలిపాడు.     

  • Loading...

More Telugu News