ఆర్జీవీ: నేను ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా తీసిన త‌రువాత దాని ప్ర‌భావం కొంద‌రి మీద ప‌డ‌వ‌చ్చు: వర్మ

  • రక్తచరిత్ర య‌థార్థ క‌థ ఆధారంగా తీసిన క‌ల్పిత క‌థ‌
  • ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అలా కాదు
  • ఈ సినిమాను కొంద‌రు మ‌నుషుల‌కు వ్య‌తిరేకంగా తీయ‌డం లేదు

తాను ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను కొంద‌రు మ‌నుషుల‌కు వ్య‌తిరేకంగా తీయ‌డం లేద‌ని, కానీ, తాను తీసే ఈ సినిమా ప్ర‌భావం కొంద‌రి మీద ప‌డ‌వ‌చ్చ‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ అన్నారు. ఈ రోజు ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... గ‌తంలో తాను తీసిన ర‌క్త‌చ‌రిత్ర సినిమా మొద‌లు అయ్యేట‌ప్పుడు య‌థార్థ క‌థ ఆధారంగా తీసిన క‌ల్పిత క‌థ అని స్ప‌ష్టంగా పేర్కొన్నాన‌ని అన్నారు.

తాను తీయ‌నున్న కొత్త సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ అక్ష‌రాలా నిజ‌మైన క‌థ‌ని, ఇది క‌ల్పిత క‌థ కాద‌ని అన్నారు. త‌న‌ను కొంద‌రు అడిగిన ప్ర‌శ్న‌లే అడుగుతున్నార‌ని, త‌న‌ను ప్ర‌శ్న‌లు అడగాలంటే ఇప్ప‌టికే తాను ఇచ్చిన ఇంట‌ర్వ్యూలను యూ ట్యూబ్‌లో చూసి అడ‌గాల‌ని అన్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో న‌టించే అంద‌రు న‌టులూ కొత్త వారేన‌ని, ఒక్కరు కూడా ప్రేక్ష‌కుల‌కు తెలిసిన వారు ఉండ‌బోర‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News