lekh tandon: షారుఖ్ ను పరిచయం చేసిన దర్శక దిగ్గజం మృతి

  • దర్శకుడు లేఖ్ టాండన్ ఇక లేరు
  • ఆయన వయసు 88 ఏళ్లు
  • సంతాపం ప్రకటించిన బాలీవుడ్ ప్రముఖులు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను బుల్లి తెరకు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు లేఖ్ టాండన్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ముంబైలో కన్నుమూశారు. 88 ఏళ్ల లేఖ్ టాండన్ ముంబైలోని తన నివాసంలో తన కుటుంబసభ్యుల సమక్షంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్, రిషి కపూర్, అమితాబ్ బచ్చన్, షబానా అజ్మీ, శేఖర్ కపూర్, అశుతోష్ గోవరికర్ తదితరులు సంతాపం ప్రకటించారు.

ఆమ్రపాలి, అగర్ తుమ్ న హోతే తదితర ఎన్నో గొప్ప చిత్రాలను టాండన్ తెరకెక్కించారు. 1988లో తన టీవీ సీరియల్ 'దిల్ దరియా'తో షారుఖ్ ను ఆయన కెమెరా ముందుకు తీసుకొచ్చారు. ఆ విధంగా షారుఖ్ బుల్లితెరకు పరిచయమయ్యారు.

lekh tandon
bollywood
bollywood director lekh tandon
shahrukh khan
  • Loading...

More Telugu News