terrorism: బయటపడిన పాక్ బుద్ధి.. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు క్లీన్ చిట్

  • ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకున్న పాక్
  • త్వరలో గృహ నిర్బంధం నుంచి విముక్తి
  • వచ్చే వారమే హఫీజ్ పిటిషన్‌పై విచారణ

దాయాది బుద్ధి మరోమారు బయటపడింది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు ఆయన నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా (జేడీయూ)పై ఉన్న ఆరోపణలను ఉపసంహరించుకుంది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం సయీద్‌ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వ అధికారి సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో సయీద్ అతడి అనుచరుల విషయంలో జారీ చేసిన ఆదేశాల్లో ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు లేవని స్పష్టం చేసింది.

ఆయనపై ఉగ్రవాద వ్యతిరేక ఆరోపణలు లేకపోవడంతో సయీద్‌ను విడుదల చేయాలని ఆయన తరపు న్యాయవాది ఏకే డోగర్ లాహార్ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయమూర్తి హఫీజ్‌పై ఉన్న ఆరోపణలను తెలియజేయాల్సిందిగా కోరారు. కాగా, హఫీజ్ దరఖాస్తుపై వచ్చేవారం విచారణ జరిగే అవకాశం ఉంది. హఫీజ్‌ను భారత్, అమెరికా, ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించాయి.

terrorism
Hafiz Saeed
pakistan
  • Loading...

More Telugu News