hillari clinton: ట్రంప్ తన తెలివితక్కువ తనంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెట్టేలా ఉన్నారు: హిల్లరీ

  • చిన్న సమస్యను ట్రంప్ జటిలం చేశారు
  • చైనా సహకారంతో ఉత్తరకొరియాతో చర్చించి ఉంటే బాగుండేది
  • ఉత్తరకొరియా తీరు సరిగ్గా లేదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తెలివి తక్కువ తనంతో మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేలా ఉన్నారని హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. దౌత్యపరంగా పరిష్కరించాల్సిన ఉత్తరకొరియా సమస్యను తన తెలివితక్కువ తనంతో ట్రంజ్ జటిలం చేశారని ఆమె విమర్శించారు. పైగా సమస్యను చర్చల ద్వారా పరిష్కరిద్దామని విదేశాంగ మంత్రి టిల్లర్సన్ సూచిస్తే, ట్రంప్ ఆయననే తప్పుపట్టారని ఆమె మండిపడ్డారు. దీంతో న్యూక్లియర్ రేసును ట్రంపే మొదలుపెట్టినట్టైందని ఆమె విమర్శించారు.

ఇలాంటి తెలివితక్కువ విధానాలతో ట్రంప్ మూడో ప్రపంచయుద్ధానికి కారణమయ్యేలా ఉన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆరంభంలోనే చైనా సహకారంతో ఉత్తరకొరియాతో ట్రంప్ చర్చలు జరిపి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఉత్తరకొరియా విధానాలు కూడా సరిగాలేవని తెలిపారు. ఐక్యరాజ్యసమితి అంక్షలను లెక్కచేయకుండా ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు చేపట్టడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. అలాగే గువామ్ పై దాడి పేరిట జపాన్ మీదుగా మిస్సైల్ ప్రయోగించడం ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని ఆమె తెలిపారు. అలాంటి ప్రయోగాలు ఏ దేశమూ జరపకూడదని ఆమె స్పష్టం చేశారు. 

hillari clinton
trumph
south koria
  • Loading...

More Telugu News