బాలయ్య: దిగ్గజ నటులు చూస్తుండగా స్టేజ్ పై తొడగొట్టిన బాలయ్య!.. వీడియో వైరల్!

  • చెన్నైలో ఇటీవల జరిగిన స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ వార్షికోత్సవంలో ఆసక్తికర  సంఘటన
  •  స్టంట్ అసిస్టెంట్లతో ఫైట్ చేసిన బాలకృష్ణ
  • ఆసక్తిగా చూసిన రజనీ కాంత్, మోహన్ లాల్, సూర్య తదితరులు
  • సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్

దిగ్గజ నటుల మధ్య బాలయ్య తొడగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ 50వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు బాలకృష్ణను స్టేజ్ పైకి ఆహ్వానించారు. స్టేజ్ పైకి బాలయ్య వెళ్లగానే, ‘స్టేజ్ పై ఓ స్టంట్ చేసి చూపిస్తారా?’ అని వ్యాఖ్యాత అడిగారు.

అందుకు ‘సరే’ అని బాలయ్య ఉత్సాహంగా చెప్పారు. ఓ నలుగురు స్టంట్ అసిస్టెంట్ లు స్టేజ్ పైకి రావడంతో వారితో స్టంట్ చేసిన అనంతరం, బాలయ్య తొడగొట్టారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ నటులు రజనీకాంత్, మోహన్ లాల్, సూర్య పలువురు నటులు బాలయ్య ఫైట్ ను, ఆయన తొడగొట్టడాన్ని ఆసక్తిగా గమనించారు.

  • Loading...

More Telugu News