renu desai: పవన్ నుంచి చాలా నేర్చుకున్నాను : రేణు దేశాయ్

  • పవన్ ది కష్టపడే తత్వం 
  • ఆయన హార్డ్ వర్క్ .. మంచితనం నచ్చుతాయి 
  • చాలా విషయాలను గురించి మాట్లాడతారు 
  • మమ్మల్ని చూసి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు  

పవన్ కల్యాణ్ .. రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన వాళ్లు విడిపోయారు. అప్పటి నుంచి రేణు దేశాయ్ పిల్లల ఆలనా పాలన పైనే పూర్తి దృష్టి పెడుతూ వచ్చారు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. "పవన్ నుంచి ఏం నేర్చుకున్నారు?" అనే ప్రశ్న రేణూకి ఎదురైంది. పవన్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆమె చెప్పారు.

హార్డ్ వర్క్ .. క్రమశిక్షణ .. మంచితనం .. ఇలా ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నానని అన్నారు. ఆయన  ఏదైనా ఒక పని చేయాలనుకుంటే, దానిపై పూర్తి దృష్టి పెడతారని చెప్పారు. అనుకున్నది సాధించేవరకూ ఆయన శ్రమిస్తారని చెప్పారు. ఇక అప్పుడప్పుడు ఆయన వచ్చి పిల్లల కోసం చాలా సమయాన్ని కేటాయిస్తారనీ, తనతో అనేక విషయాలు మాట్లాడతారని అన్నారు. "ఇంతమంచిగా వుండే మీరెందుకు విడాకులు తీసుకున్నారు"? అంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోతూ ఉంటారని చెప్పుకొచ్చారు.  

renu desai
  • Loading...

More Telugu News