renu desai: మగ పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు... నేను మాట్లాడితే మాత్రం చర్చ ఎందుకో తెలియట్లేదు: రేణు దేశాయ్

  • ఇంట్లో సరిగ్గా పెంచితే, సమాజంలో ఇబ్బంది ఉండదు
  • నా కుమారుడికి చెబుతూ ఉంటా
  • అమ్మాయిల భద్రతపై రేణూ దేశాయ్

మనింట్లో అబ్బాయిని సరిగ్గా పెంచి, బయట బుద్ధిమంతుడిగా మసలుకునేలా చూడగలిగితే సమాజంలో అమ్మాయిలకు ఎటువంటి ఇబ్బందులూ కలగవని నటి రేణూ దేశాయ్ వ్యాఖ్యానించింది. అమ్మాయిలకు సమాజంలో భద్రతపై మాట్లాడిన రేణూ, తన కుమారుడు అకీరాకు ఈ విషయంలో అవగాహన కల్పిస్తుంటానని తెలిపారు. ఇదే సమయంలో అతి జాగ్రత్త కూడా తగదని అన్నారు. తాను చెప్పే మాటలు తన జీవితానికి సంబంధించినవి కాకున్నా, ఇటువంటి విషయాలపై తాను మాట్లాడగానే చర్చ మొదలవుతుందని, ఎందుకలా జరుగుతుందో తెలియదని అన్నారు.

ఓ మహిళగా తన అభిప్రాయాలను తాను చెబుతుంటానని అన్నారు. సింగిల్ పేరెంట్ గా ఉన్న తనకు అనుక్షణం బాధ్యతలు గుర్తుకొస్తుంటాయని, పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలని నిత్యమూ కృషి చేస్తుంటానని అన్నారు. దేశంలో జరుగుతున్న అక్రమాలు చూసి భయంతో పిల్లలను అంటిపెట్టుకునే ఉంటున్నానని, వాళ్లను స్వయంగా స్కూల్ లో దింపి, తిరిగి తీసుకొస్తుంటానని అన్నారు.

renu desai
akira
single parent
  • Loading...

More Telugu News