renu desai: నేను చనిపోతే నీకు పెళ్లెవరు చేస్తారే?: ఏడుస్తున్న కూతురిని ఓదార్చిన రేణూ దేశాయ్

  • ఆర్తో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడిన రేణు
  • నిద్రపోతుంటే వచ్చి ఏడుస్తూ కూర్చున్న ఆద్య
  • 'చనిపోవద్దమ్మా' అంటూ ఏడుపు
  • ఓదార్చిన రేణూ దేశాయ్

కొంతకాలం క్రితం తనకు తీవ్రమైన జ్వరం, 'ఆర్తో ఇమ్యూన్ కండిషన్' సోకినప్పుడు, దాని ట్రీట్ మెంట్ కు ఎంతో కాలం పట్టడం, అదే సమయంలో గుండెలో సమస్యతో, ఇంటికీ, ఆసుపత్రికీ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న వేళ, జరిగిన ఓ ఘటన గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. తాను వేసుకున్న మాత్రల కారణంగా గాఢ నిద్రలోకి వెళ్లగా, స్కూలు నుంచి వచ్చిన తన కుమార్తె ఆద్యా, లేపేందుకు ప్రయత్నించి, విఫలమై, అమ్మ చనిపోతుందేమోనన్న ఆందోళనతో ఏడ్చేసిందని రేణూ వెల్లడించింది.

తనకు మెలకువ వచ్చేసరికి '‘ప్లీజ్‌ మమ్మీ, నువ్వు చచ్చిపోవద్దు ప్లీజ్‌' అని ఒకటే ఏడుపట. దీంతో తాను కూడా ఏడిస్తే కూతురు భయపడుతుందని భావించి, బాధను మనసులోనే దాచుకుంటూ, "నేను చనిపోనులే నీతోనే ఉంటాను. ప్రామిస్. అసలు నేను చనిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు? నీ పిల్లలను ఎవరు చూస్తారు?" అని చెప్పి ఓదార్చిందట. మమ్మీని త్వరగా తీసుకు వెళ్లవద్దని దేవుడికి దణ్ణం పెట్టుకోమని చెబితే, దేవుడి ముందు పాప ఎంత సేపు కూర్చుందో కూడా తనకు తెలియలేదని రేణూ వెల్లడించింది.

renu desai
pavan kalyan
aadhya
  • Loading...

More Telugu News