క్రికెట్: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన
- ఈ నెల 22న మొదటి వన్డే, 25న రెండో వన్డే, 29న మూడో వన్డే
- అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి
- కేఎల్ రాహుల్ కు దక్కని చోటు
ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి మంచి హుషారుగా ఉన్న టీమిండియా ఇక న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే వన్డే మ్యాచుల్లో ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల పేర్లను ఈ రోజు బీసీసీఐ ప్రకటించింది. అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే కేఎల్ రాహుల్ పేరు కూడా టీమిండియా 15 మంది ఆటగాళ్ల జాబితాలో లేదు. న్యూజిలాండ్ టీమ్‌తో ఇండియా మొత్తం మూడు వన్డేలు ఆడనుంది. ఈ నెల 22న మొదటి వన్డే, 25న రెండో వన్డే, 29న మూడో వన్డే ఆడనుంది.
టీమిండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానె, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహెల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్.