రామ్ చరణ్: 'మిస్టర్ సీ అండ్ బ్రాట్' అంటూ లేటెస్ట్ ఫొటో పోస్ట్ చేసిన ఉపాసన!

  • రామ్‌చరణ్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అలరిస్తోన్న ఉపాసన
  • తమ కుక్కను ఒడిలో పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తోన్న రామ్ చరణ్
  • అలరిస్తోన్న ఫొటో

త‌న భ‌ర్త‌, యంగ్ హీరో రామ్‌చరణ్ తేజ్ కు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ, ఆయ‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను చెబుతూ ఉపాసన అభిమానుల‌ను అల‌రిస్తుంటోంది. రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఏ వేడుక‌లోనైనా పాల్గొన్నా, ఇంట్లో స‌ర‌దాగా గ‌డిపినా అందుకు సంబంధించిన ఫొటో మొద‌ట ఉపాస‌న ట్విట్ట‌ర్‌లోనే క‌న‌ప‌డుతోంది. తాజాగా త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్‌, పెంపుడు కుక్కతో సోఫాలో కూర్చొని ఉండ‌గా తీసిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది.

అందులో కుక్క‌ను ప్రేమ‌గా చూస్తూ, చిరున‌వ్వులు చిందిస్తూ చెర్రీ ఉన్నాడు. ‘మిస్టర్ సీ (చ‌ర‌ణ్‌), బ్రాట్ (కుక్క పేరు)’ అంటూ ఉపాసన పేర్కొంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌.. ‘రంగస్థలం 1985’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

  • Loading...

More Telugu News