ram gopalvarma: బ్రదర్ అనిల్ కుమార్ ను కలిసిన రాంగోపాల్ వర్మ!

  • బ్రదర్ అనిల్ కుమార్ వైఎస్సార్సీపీ అధినేత జగన్ సోదరి షర్మిలకు భర్త
  • హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో అనిల్ తో వర్మ భేటీ
  • క్రైస్తవానికి సంబంధించిన విషయాలు తప్ప ఇంకెలాంటి విషయాలు మాట్లాడలేదు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కలవడం కలకలం రేపుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రకటించిన నాటి నుంచి వివాదం రాజుకోగా, వైఎస్సార్సీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాత కావడంతో అది మరింత ఎక్కువైంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఇందులో నటిస్తారని ప్రకటించడంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది.

దీంతో టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఈ క్రమంలో వివాదాన్ని మరింత రాజేస్తూ బ్రదర్ అనిల్ కుమార్ ను హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో ఈ రోజు వర్మ కలవడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ, తమ భేటీకి ఎలాంటి ప్రాముఖ్యత లేదని అన్నారు. పార్క్ హయాత్ హోటల్ లో యాదృచ్చికంగా కలిశామని చెప్పారు. తమ మధ్య క్రైస్తవ మతానికి సంబంధించి తప్ప మరెలాంటి చర్చ జరగలేదని తెలిపారు.  

ram gopalvarma
bro anil
park hayath
Hyderabad
  • Loading...

More Telugu News