samanta: ముందుగా 'మహానటి' సినిమా షూటింగుకి సమంత!

  • తిరిగి షూటింగ్స్ పై దృష్టి పెట్టిన సమంత 
  • సెట్స్ పై 'మహానటి' .. 'రంగస్థలం'
  • కోలీవుడ్ సినిమాలను కూడా పూర్తి చేయాలనే ఆలోచన
  • ఆ తరువాతనే హనీమూన్  

నాగ చైతన్య .. సమంతల వివాహ వేడుకకి సంబంధించిన సందడి పూర్తయింది. ఈ వేడుక తరువాత సమంత 'రంగస్థలం' సినిమా షూటింగులో పాల్గొననుందనే టాక్ వచ్చింది. అయితే ఈ రోజు నుంచి ఆమె 'మహానటి' సినిమా షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం.

 ఈ సినిమాలో సమంత ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఆమె పాత్రకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు బ్యాలెన్స్ వున్నాయట. అవి పూర్తి చేసుకుని .. ఆ తరువాత 'రంగస్థలం' షూటింగులో జాయిన్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత .. కోలీవుడ్ లో కమిటైన రెండు సినిమాలను కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో సమంత ఉందని అంటున్నారు. ఈ లోగా చైతూ కూడా తాను కమిటైన సినిమాలను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News