: నడుసున్న రైల్లోనే రెండు సార్లు కవలలకు జన్మనిచ్చింది
కొన్ని యాదృచ్చికమో, దైవ నిర్ణయమో తెలియదు కానీ అలా జరిగిపోతుంటాయి. ఒక మహిళ నాలుగేళ్ల కిందట నడుస్తున్న రైల్లో కవలలకు జన్మనిచ్చింది. మళ్లీ ఇప్పుడు కూడా ప్రయాణిస్తున్న రైల్లోనే మరోసారి కవల పిల్లలను ప్రసవించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన చుబిన్ నిషా తన భర్తతో కలిసి ఆదివారం ముంబై నుంచి గోండాకు డెలివరీ కోసం వెళుతోంది. నొప్పులు ఎక్కువయ్యాయి. లక్నో చేరుకునేలోపే పండంటి కవల పిల్లలను కనేసింది. దీనిపై చుబిన్ భర్త హబీబుల్లా మాట్లాడుతూ.. ఇది కచ్చితంగా దైవానుగ్రహమేనన్నాడు. రెండోసారీ తన భార్య రైల్లో ప్రయాణిస్తూ.. మళ్లీ కవలలకే జన్మనివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నాడు.