Krishnapatnam Port: స్మార్ట్ లాజిస్టిక్‌ను పెంచిన కృష్ణపట్నం పోర్టుకు ప్రతిష్ఠాత్మక స్మార్ట్ ‘పోర్టు అవార్డు’

  • పోర్టు తరపున అందుకున్న డీజీఎం మోహన్
  • పలు రంగాల్లో విశేష కృషి చేసిన సంస్థలకూ అవార్డులు
  • ప్రదానం చేసిన మంత్రి దేవినేని

స్మార్ట్ లాజిస్టిక్‌ను పెంచడంలో విశేష కృషి చేసిన కృష్ణపట్నం పోర్టుకు ప్రతిష్ఠాత్మక స్మార్ట్ పోర్టు అవార్డు దక్కింది. శుక్రవారం విజయవాడలో జరిగిన స్మార్ట్ లాజిస్టిక్ సదస్సులో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా కృష్ణపట్నం పోర్టు తరపున డీజీఎం జి.మోహన్ ఈ అవార్డును అందుకున్నారు.

అలాగే పొగాకు ఎగుమతుల్లో ఐటీసీ లిమిటెడ్‌కు స్మార్ట్ ఎక్స్‌పోర్ట్ అవార్డు దక్కింది. ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ ఈ అవార్డును అందుకున్నారు. ఇదే రంగంలో గాడ్ ఫ్రే ఫిలిప్స్, జితేంద్ర కుమార్, శ్యామ్ సుందర్, పొలిశెట్టి, కృష్ణారావులు కూడా అవార్డులు స్వీకరించారు.

కాటన్ రంగంలో మహాలక్ష్మీ ఇండస్ట్రీస్ తరపున అమిత్ గుప్తా, నక్కల కోటేశ్వరరావు అవార్డులు అందుకున్నారు. మిర్చి ఎక్స్‌పోర్టులో నంద్యాల సత్యనారాయణ, రామశివ ట్రేడర్స్‌కు చెందిన ఎస్.మోహన్, సముద్ర ఆహారోత్పత్తుల రంగంలో సాగర్ గాంధీ, గ్రానైట్ రంగంలో అంజలి గ్రానైట్స్‌కు చెందిన మహేశ్‌లు అవార్డులు స్వీకరించారు. స్మార్ట్ ఫర్నిచర్ దిగుమతుల రంగంలో డాకర్స్ ట్రేడింగ్‌కు చెందిన శ్రీనివాసరావుకు అవార్డు దక్కింది.

Krishnapatnam Port
AP
Minister Devineni
ITC
  • Loading...

More Telugu News