కేటీఆర్: కేటీఆర్ సార్! అధికార పార్టీ వాళ్లకు ఫ్లెక్సీల నిషేధం నిబంధన వర్తించదా?: మంత్రిని ప్రశ్నించిన నెటిజన్

  • రేపు వరంగల్ లో పర్యటించనున్న కేటీఆర్ 
  • నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటుపై ప్రశ్నించిన ఓ నెటిజన్
  • ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలంటూ కేటీఆర్ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరంగల్ లో కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫ్లెక్సీ ఫొటోతో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఓ నెటిజన్ ఓ ట్వీట్ చేశాడు. ‘కేటీఆర్ సార్, రేపు మీ పర్యటన సందర్భంగా వరంగల్ లో దృశ్యమిది. అధికారపార్టీ వారికి ఫ్లెక్సీల నిషేధం నిబంధన వర్తించదా? మాట వరసకు అడుగుతున్నా’ అంటూ ఆ నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఈ పోస్ట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్, ‘వీటన్నింటిని వెంటనే తొలగించమని వరంగల్ మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యక్తులకు జరిమానా విధించండి’ అని తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఆదేశించారు. 

  • Loading...

More Telugu News